News October 10, 2024
రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం

దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.
Similar News
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.