News December 11, 2024
బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన

ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ రూ.3.16లక్షల కోట్లు అని రాజ్యసభలో వెల్లడించారు. అటు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1.34లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు. అది 1.86%కి సమానమన్నారు. ప్రభుత్వ రంగం(3.09%)తో పోలిస్తే ఇది తక్కువ అని స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
మెదక్: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాయికాడి రాజమణికి కౌడిపల్లి బస్టాండ్ వద్ద బస్సులో గుండెపోటు వచ్చింది. బంధువులు కౌడిపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
News October 24, 2025
నింగిలోకి ఎగిరిన తొలి స్వదేశీ ట్రైనర్ ఫ్లైట్

స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన భారత తొలి ట్రైనర్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. బెంగళూరులో తయారు చేసిన హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40(HTT-40) అందుబాటులోకి వచ్చినట్లు HAL వెల్లడించింది. దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ వారియర్స్ శిక్షణ పొందుతారంది. ముందు ఒకరు, వెనుక మరొకరు కూర్చునేలా డిజైన్ చేసింది. బేసిక్ ఫ్లైట్ ట్రైనింగ్, వైమానిక విన్యాసాలు, నైట్ ఫ్లైయింగ్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.
News October 24, 2025
అడవులను కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించం: పవన్

AP: అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని Dy.CM పవన్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్లో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తాం. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.


