News January 29, 2025

రేపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ రేపు పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖకు చేరుకోనున్న వారు తొలుత ప్లాంట్‌ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ అధికారులతో విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, ఇతర అంశాలపై సమీక్షిస్తారు. కాగా ఇటీవల కేంద్రం స్టీల్ ప్లాంట్ కోసం రూ.11000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 1, 2025

కరీంనగర్: ‘గ్రానైట్ మాఫియా గుప్పెట్లో గ్రామాలు’

image

గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్న గ్రామపంచాయతీ ఎన్నికలను గ్రానైట్ మాఫియా శాసిస్తోంది. తమకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్ బరిలో నిలిపి తెరవెనుక రాజకీయం నడిపిస్తోంది. అభ్యర్థులకయ్యే ఖర్చును గ్రానైట్ మాఫియానే భరిస్తూ గ్రామాలను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందట. కొత్తపల్లి, గంగాధర, శంకరపట్నం మండలాల్లోని 17 గ్రామాలతో పాటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లోనూ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి.

News December 1, 2025

భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

image

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.