News October 4, 2024
ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు

APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్ను వెబ్ల్యాండ్తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.
Similar News
News December 26, 2025
మానసిక సంతృప్తే నిజమైన సంతోషం: మోహన్ భాగవత్

AP: మనిషికి నిజమైన సంతోషం మానసిక సంతృప్తిలోనే ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మనిషికి సుఖదుఃఖాలు తాత్కాలికమని, ఎంత సంపాదించినా మనసుకు తృప్తి లేకపోతే ఆనందం ఉండదని అభిప్రాయపడ్డారు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. సరైన మార్గంలో పయనిస్తే లక్ష్యం తప్పక చేరుతామని స్వామి వివేకానంద నిరూపించారన్నారు.
News December 26, 2025
ఆ ధీరుడిని TDP గూండాలు హతమార్చి..: అంబటి ట్వీట్

AP: దివంగత కాపు ఉద్యమనేత వంగవీటి మోహన రంగాకు మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబు నివాళులు అర్పించారు. ఈమేరకు ట్వీట్ చేస్తూ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 37 సంవత్సరాలు. “జోహార్ వంగవీటి మోహన రంగా”!’ అని Xలో పొందుపరిచారు. మరోవైపు వైసీపీ నేతలు పలువురు రంగాకు నివాళులు అర్పించారు.
News December 26, 2025
అమ్మ సెంటిమెంట్.. మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్

సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాశ్ను ఓ వ్యక్తి SMలో సాయం కోరాడు. ఓ ఫొటోను షేర్ చేసి.. అమ్మ చనిపోయిందని అంత్యక్రియలకు డబ్బుల్లేవని తెలిపాడు. దీంతో చలించిపోయిన జీవీ ప్రకాశ్.. రూ.20,000 పంపించారు. అయితే ఆ ఫొటో 2022 నాటిదని, తాను మోసపోయానని తర్వాత గుర్తించారు. అమ్మ పేరుతో మోసం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సాయం చేసిన GVని ప్రశంసిస్తున్నారు.


