News September 25, 2024

ఒకే చట్టం పరిధిలోని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు

image

AP: రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో యూనివర్సిటీ వీసీలను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News September 25, 2024

న్యాయ పోరాటం చేస్తా: గజ్జల లక్ష్మి

image

AP: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరిందని YCP నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ గజ్జల లక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. తనను పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. తన పదవీకాలం 2026 మార్చి 15 వరకు ఉన్నా అర్ధాంతరంగా తొలగించారని ఆరోపించారు. వలంటీర్లకు పెండింగ్ వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న బాబు ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు.

News September 25, 2024

భూమికి భారంగా చైనా డ్యామ్!

image

చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News September 25, 2024

ఆసీస్‌కు మన బౌలింగ్ వేడి తగులుతుంది: మంజ్రేకర్

image

ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు భారత్ తమ అత్యుత్తమ పేస్ దళాన్ని తీసుకెళ్లాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘బుమ్రా, షమీ, సిరాజ్, ఆకాశ్ దీప్‌తో కూడిన టీమ్ ఇండియా పేస్ బ్యాటరీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు ఆ వేడి కచ్చితంగా తగులుతుంది. మన ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయడమే కీలకం. సీనియర్లు బరువును మోయాలి. భారత్ ఈసారి కూడా సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.