News December 29, 2024

షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

image

AP: కాకినాడలో స్టెల్లా షిప్‌లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమరవాణాపై ఏకంగా Dy.CM పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేశారు. మొత్తం 1,320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్‌లో భద్రపరిచారు. మరోవైపు షిప్‌లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Similar News

News January 1, 2025

టెస్టుల్లో 148 ఏళ్లలో తొలిసారిగా గత ఏడాది ఆ ఘనత!

image

గత ఏడాది టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికర రికార్డు నమోదైంది. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 53 టెస్టుల్లో 50 మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి. మూడు మ్యాచులు మాత్రమే డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్ 9 టెస్టులు, భారత్ 8, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక తలో ఆరేసి, బంగ్లా, ఐర్లాండ్, పాక్, వెస్టిండీస్ రెండేసి చొప్పున టెస్టులు గెలిచాయి.

News January 1, 2025

ముఫాసా.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..?

image

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత నెల 20న విడుదలైన ఈ మూవీకి తెలుగులో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాకు కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. తాజాగా ఈ మూవీకి ఓటీటీ పార్ట్‌నర్‌గా హాట్ స్టార్ ఫిక్స్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. మార్చిలో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కావొచ్చని సమాచారం.

News January 1, 2025

ఉగాదే మన కొత్త సంవత్సరం: రాజాసింగ్

image

TG: తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం పేరిట విదేశీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు నేటి తరం అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆంగ్లేయులు జనవరి 1ని మనపై రుద్ది వెళ్లారు. ఆ వలస సంస్కృతిని వదిలేద్దాం. ప్రభుత్వాలు, మేధావులు ఉగాదిని కొత్త సంవత్సరంగా అలవాటు చేయాలి. క్లబ్బులు, పబ్బులు భారత సంస్కృతి కాదు’ అని పేర్కొన్నారు.