News March 29, 2024
USA జట్టులో ఉన్ముక్త్ చంద్‌కు దక్కని చోటు

USA టీ20 జట్టులో భారత్‌కు చెందిన ఉన్ముక్త్ చంద్ చోటు దక్కించుకోలేకపోయారు. USA తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు అతను భారత్‌ను వీడి వెళ్లారు. అక్కడ జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో రాణించారు. 45 ఇన్నింగ్స్‌లో 1500 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా అతనికి నిరాశే ఎదురైంది. కెనడాతో జరిగే టీ20 సిరీస్‌కు అతడు సెలక్ట్ కాలేదు. దీంతో T20 WCలో అతడు ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
Similar News
News January 22, 2026
నవజాత శిశువుల్లో ఈ లక్షణాలున్నాయా?

శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటివి పసిపిల్లల్లో జలుబు లక్షణాలు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నా, ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
News January 22, 2026
ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.
News January 22, 2026
విజయ్ సినిమా పేరే పార్టీ గుర్తు.. ఓటర్లు ‘విజిల్’ వేస్తారా?

తమిళ హీరో విజయ్ ‘TVK’ పార్టీకి EC ఇవాళ విజిల్ గుర్తును కేటాయించింది. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘విజిల్’ పేరిటే ఎన్నికల గుర్తు రావడంతో ఫ్యాన్స్‌తో పాటు కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రెండింటికీ లింక్ చేస్తూ ‘విజిల్ పోడు’ అని SMలో పోస్టులు పెడుతున్నారు. మూవీ మాదిరే పార్టీ కూడా ఎన్నికల్లో విజిల్ వేసి గెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది సమ్మర్లో TNలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.


