News April 7, 2024
భారత్‌పై UNO జనరల్ అసెంబ్లీ చీఫ్ ప్రశంసలు

భారత్‌పై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసల వర్షం కురిపించారు. పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్ పనితీరు అద్భుతమని కొనియాడారు. డిజిటలైజేషన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఉన్న చోట నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీంతో ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని ప్రశంసించారు.
Similar News
News February 2, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.
News February 2, 2026
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.
News February 2, 2026
ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం


