News September 27, 2024

UNSC మెంబర్‌షిప్: భారత్‌కు యూకే సపోర్ట్

image

UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి UK PM కీర్ స్టార్మర్ సపోర్ట్ ‌ ఇచ్చారు. ‘కౌన్సిల్లో ఆఫ్రికాకు శాశ్వత ప్రాతినిధ్యం ఉండాలి. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీని శాశ్వత సభ్యులుగా చూడాలనుకుంటున్నాం. ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు ఉండాలి’ అని అన్నారు. కొన్నాళ్ల కిందటే జో బైడెన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్‌కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం UNSCలో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి.

Similar News

News September 27, 2024

మీ స్పందనకు కృతజ్ఞుడిని: NTR

image

ఈరోజు రిలీజైన దేవర సినిమాకు వస్తున్న స్పందనపై స్టార్ యాక్టర్ జూ.ఎన్టీఆర్ స్పందించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు మొత్తానికి వచ్చేసిందని, అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని ట్వీట్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకు, డీఓపీకి థాంక్స్ చెప్పారు. అనిరుధ్‌ అందించిన మ్యూజిక్‌పైనా ప్రశంసలు కురిపించారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని, ఇలాగే అలరిస్తుంటానని రాసుకొచ్చారు.

News September 27, 2024

సరోగసీ తల్లికీ 6 నెలల మాతృత్వ సెలవు

image

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు మాతృత్వ సెలవులు ప్రకటిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సరోగసీ తండ్రులకూ 15 రోజులపాటు పితృత్వ సెలవులు ఉంటాయని పేర్కొంది. తొలి రెండు కాన్పులకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సరైన మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది.

News September 27, 2024

కర్ణాటక.. అడగ్గానే కుంకీ ఏనుగులను ఇచ్చింది: పవన్

image

AP: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.