News March 16, 2024

హుజూరాబాద్‌లో కనిపించని నిరసన!

image

ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా నిరసనలు కనిపించడం లేదు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు స్తబ్ధుగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Similar News

News September 2, 2025

KNR: పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని DMHO ఆకస్మిక తనిఖీ

image

DMHO డా. వెంకటరమణ, పీఓ ఎంసీహెచ్ డా. సన జవేరియాతో కలసి మోతాజ్ ఖానా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం యొక్క హాజరు పట్టిక, అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు డయాబెటిస్ రోగుల రికార్డులను తనిఖీ చేశారు. పంపిణీ చేస్తున్న మందుల వివరాలను పరిశీలించారు. పేషంట్లు అందరూ ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.

News September 2, 2025

KNR: భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భూముల సర్వే నంబర్లు, భూ సేకరణ విస్తీర్ణం తదితర అంశాలపై ఇరిగేషన్, రెవెన్యూ, అధికారులతో చర్చించారు. సేకరణ ప్రక్రియ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.

News September 1, 2025

కరీంనగర్: ప్రజావాణికి 269 దరఖాస్తులు

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 269 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలోని అన్ని పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.