News September 1, 2024
UNSOLD: హర్మన్, శ్రేయాంకకు షాక్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్, ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్‌కు WBBL డ్రాఫ్ట్‌లో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్ 5 సీజన్లలో 62 మ్యాచులాడి 117.16 స్ట్రైక్‌రేట్‌లో రన్స్ చేశారు. 2023 WPL టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. మరోవైపు శ్రేయాంకా పాటిల్ సైతం 2024 WPL ఛాంపియన్ RCB జట్టులో సభ్యురాలు కావడం గమనార్హం.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


