News March 4, 2025

వేలం తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

image

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్‌లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.

Similar News

News March 4, 2025

ICAI పరీక్షా ఫలితాల విడుదల

image

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News March 4, 2025

వారికి ప్రభుత్వ పథకాలు కట్?

image

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.

News March 4, 2025

రూ.100 కోట్ల ఆస్తి.. తల్లిని చంపేసిన కొడుకు

image

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!