News November 24, 2024
అమ్ముడుపోని పడిక్కల్

టీమ్ ఇండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అన్‌సోల్డ్‌గా నిలిచారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతడిని తీసుకోవడానికి ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్లలో బెంగళూరు, రాజస్థాన్, తదితర జట్లకు ఆడారు. 64 మ్యాచుల్లో 1559 రన్స్ చేశారు.
Similar News
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
News December 6, 2025
విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.
News December 6, 2025
ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.


