News November 24, 2024
అమ్ముడుపోని వార్నర్

డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోలేదు. మూడో సెట్లో ఆయన పేరు రాగా తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిని చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్ ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రమే. ఇక ఆస్ట్రేలియా తరఫున ఆయన అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్ కావడం కూడా ఫ్రాంచైజీల అనాసక్తికి కారణం కావొచ్చని అంచనా.
Similar News
News January 15, 2026
ISS నుంచి స్టార్ట్ అయిన వ్యోమగాములు

ISS నుంచి నలుగురు వ్యోమగాములు ముందుగానే భూమికి తిరిగొస్తున్న <<18804760>>విషయం<<>> తెలిసిందే. ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:50కి స్టార్ట్ అయ్యారు. స్పేస్-X డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు అమెరికన్, ఒక జపాన్, ఒక రష్యన్ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. 2:OO PMకి కాలిఫోర్నియాలోని పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ కానున్నారు.
News January 15, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఇకపై గ్రోక్లో బికినీ ఫొటోలు రావు!

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.


