News March 25, 2025

UNSUNG HERO: అరంగేట్రంలోనే నిగమ్ సంచలనం

image

ఐపీఎల్ అరంగేట్రంలోనే విప్రాజ్ నిగమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ 113 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నిగమ్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు బాది సమీకరణాలు మార్చేశారు. LSGపై DC సంచలన విజయంలో అశుతోశ్ శర్మకు ఎంత క్రెడిట్ ఉందో 20 ఏళ్ల నిగమ్‌కూ అంతే ఉంది. అందరూ అశుతోశ్‌ను పొగుడుతున్నారు కానీ నిగమ్‌ను మాత్రం మరిచిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Similar News

News January 24, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.

News January 24, 2026

రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

image

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 24, 2026

మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.