News January 9, 2026
UP: 30ఏళ్లు పాక్ మహిళ ప్రభుత్వ ఉద్యోగం.. చివరికి

పాకిస్థానీ నేషనాలిటీని దాచేసి UPలో 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన మహిళ బండారం బయటపడింది. దీంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేయగా, పోలీసులు FIR నమోదు చేశారు. మహీరా అక్తర్(ఫర్జానా) 1979లో పాకిస్థానీని పెళ్లాడి అక్కడి పౌరసత్వాన్నీ పొందింది. విడాకుల తర్వాత IND వచ్చి 1985లో ఓ లోకల్ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ జాబ్ సాధించింది. తాజాగా విద్యాశాఖ దర్యాప్తులో ఆమె ముసుగు తొలిగింది.
Similar News
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 18, 2026
మోడల్‌తో ఇషాన్ కిషన్ పెళ్లి? తల్లి ఏమన్నారంటే

మోడల్ అదితి హుందియాను క్రికెటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారాన్ని ఆయన తల్లి సుచిత్రా దేవి ఖండించారు. ‘ఇది ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం. పెళ్లి గురించి ఆలోచించేంత వయసు ఇషాన్‌కి ఇంకా రాలేదు’ అని పేర్కొన్నారు. కాగా అదితిని ఇషాన్ ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటే అభ్యంతరం లేదని ఇటీవల ఇషాన్ తాత <<19147364>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. ఆయన ఎగ్జైట్‌మెంట్‌లో అలా అన్నారని దేవి వివరించారు.
News February 18, 2026
మదనపల్లె హత్యాచార ఘటన.. నిందితుడి తల్లి పాత్ర ఉందని ఆరోపణ!

AP: మదనపల్లెలో బాలికపై <<19173027>>హత్యాచారం<<>> వెనుక నిందితుడు కులవర్ధన్ తల్లి పాత్ర కూడా ఉందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. కులవర్ధన్‌కు మద్దతుగా కొందరు తమపై దాడి చేసేందుకు వచ్చారని, ఆ గ్యాంగ్‌ను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. వారంతా గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నారన్నారు. కులవర్ధన్ గతంలో వీధిలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు.


