News May 3, 2024
బుల్డోజర్లతో యూపీ సీఎం ఎన్నికల ర్యాలీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే ముందుగా గుర్తొచ్చేది బుల్డోజర్. అక్రమ కట్టడాలను కూల్చేందుకు ఆయన బుల్డోజర్లను వినియోగిస్తూ వచ్చారు. ఇప్పుడు తన ఎన్నికల ప్రచారంలోనూ దాన్నే వినియోగిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి కంచుకోట అయిన మెయిన్పురిలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన తాజాగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా 14 బుల్డోజర్లతో ర్యాలీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Similar News
News October 28, 2025
సకల శుభాలను ప్రసాదించే ఆదిపరాశక్తి శ్లోకం

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
ఈ శ్లోకం సాక్షాత్తు ఆది పరాశక్తిని స్తుతిస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తే అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారు మనల్ని అన్ని విధాలా కాపాడుందని అంటున్నారు. చెడు ఆలోచనలు రాకుండా చేసి, భయాలను దూరం చేసి, శాంతి, అదృష్టం, క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని పేర్కొంటున్నారు. <<-se>>#Shloka<<>>
News October 28, 2025
ట్రంప్కు MRI టెస్ట్… ఆరోగ్యంపై సందేహాలు

ఇటీవల తనకు MRI స్కానింగ్ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. జ్ఞాపకశక్తి పరీక్ష చేయించుకున్నట్లు చెబుతూ అంతా బాగానే ఉందన్నారు. దీనిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన నాడీ, హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారేమోనని GW వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ రైనర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ట్రంప్ చేతులపై మచ్చలు, నడకలో మార్పు, జ్ఞాపకశక్తి లోపంతో తడబాటు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
News October 28, 2025
రేపు, ఎల్లుండి పలు ఆర్జిత సేవలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 8-9 గంటల వరకు పుష్పయాగానికి అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎల్లుండి తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉండవని పేర్కొంది.


