News November 20, 2024

ఓటర్లను అడ్డుకున్న UP పోలీసులు.. ఏడుగురు స‌స్పెండ్‌

image

యూపీలో ఉపఎన్నిక‌లు ఉద్రిక్తంగా మారాయి. మీరాపూర్‌లో ఓట‌ర్ల‌పై పోలీసు తుపాకీ ఎక్కుపెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ముస్లిం ఓట‌ర్లు ఓటు వేయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అఖిలేశ్ యాద‌వ్‌ విడుద‌ల చేసిన‌ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఓట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు ఓట‌ర్ల స్లిప్పుల‌ను ప‌రిశీలించి అడ్డ‌గించ‌డం వివాద‌మైంది. దీంతో ఏడుగురు పోలీసులను ఎన్నిక‌ల సంఘం సస్పెండ్ చేసింది.

Similar News

News January 19, 2026

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

image

వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి ముందు వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27న సమ్మె జరగనుంది. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్.

News January 19, 2026

వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

image

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.

News January 19, 2026

WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.