News June 4, 2024
UP: స్మృతి, రాజ్‌నాథ్ వెనుకంజ

ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా వెనకబడింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం 37లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాల్లో దూసుకుపోతోంది. అమేథీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం వెనుకంజలో ఉన్నారు.
Similar News
News January 10, 2026
WPL: ఇవాళ డబుల్ ధమాకా

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్‌లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
News January 10, 2026
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

TG: నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. గ్రూప్స్ ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాగా ఇటీవల జాబ్ క్యాలెండర్ కోరుతూ విద్యార్థులు <<18794438>>ఆందోళన<<>> చేపట్టిన విషయం తెలిసిందే.
News January 10, 2026
‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని ‘sacnilk’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.


