News July 26, 2024

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 30 వరకు వెబ్ ఆప్షన్లు

image

AP: 2024-25 విద్యాసంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ఎంపిక నేటి నుంచి మొదలైంది ఈ నెల 2న చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ నెల 29 వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని కళాశాల విద్యావిభాగం తెలిపింది. ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు ఈ నెల 30వరకు గడువు ఉంది. వచ్చే నెల 3న సీట్లు కేటాయిస్తారు. వచ్చే నెల 5 నుంచి 8 లోపు అభ్యర్థులు తమ కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Similar News

News November 26, 2025

KNR: ఎన్నికలకు పూర్తి సంసిద్ధంగా ఉండాలి: సీపీ

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్