News June 4, 2024
UP: మోదీ, యోగీ మ్యాజిక్ ఏది?

యూపీ, మోదీ, యోగి.. మొన్నటి వరకు ఈ కాంబినేషన్‌కు ఎదురులేదు. అలాంటిది ఈ ఎన్నికల్లో ఈ ద్వయానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 80లో అత్యధిక సీట్లు గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే ఇప్పుడేమో సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే ఇక్కడ 37 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి 42 చోట్ల గెలిచేలా కనిపిస్తోంది. దాంతో మోదీ, యోగీ జోడీ మ్యాజిక్ పనిచేయలేదని అర్థమవుతోంది. ఎస్పీ అనూహ్యంగా పుంజుకోవడమే ఇందుకు కారణం.
Similar News
News October 16, 2025
తాలిబన్లు మనకు శత్రువులా?

<<18023858>>అఫ్గానిస్థాన్<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్‌లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.
News October 16, 2025
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

‘బలగం’తో డైరెక్టర్‌గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్‌కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
News October 16, 2025
సెమీస్‌లో 3 బెర్తులు.. పోటీలో నాలుగు జట్లు!

WWC సెమీస్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ బంగ్లాపై విజయంతో AUS సెమీస్‌కు దూసుకెళ్లింది. మిగిలిన 3 స్థానాల కోసం ప్రధానంగా 4 జట్ల మధ్యే పోటీ ఉండనుంది. పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చివరి 3 స్థానాల్లో ఉన్న బంగ్లా(2), శ్రీలంక (2), పాక్(1) దాదాపు రేస్ నుంచి తప్పుకున్నట్లే. ENG(7), SA(6), IND(4), NZ(3) పోటీ పడనున్నాయి. పాయింట్స్‌తో పాటు రన్‌రేట్ కీలకం కానుంది. మీ ప్రిడిక్షన్ కామెంట్ చేయండి.