News May 12, 2024

క్లీంకారతో ఉపాసన మొదటి మదర్స్ డే

image

మదర్స్ డేను హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘క్లీంకారతో నా మొదటి మదర్స్ డే అనుభవం అద్భుతంగా ఉంది. నా జీవితాన్ని చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. దీనికి కూతురు క్లీంకార, తల్లి శోభనాతో కలిసి దిగిన ఫొటోను జత చేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ ఏడాది జనవరి 20న క్లీంకారకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News April 11, 2026

మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

image

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>

News April 11, 2026

సంక్రాంతికి బాలయ్య-విజయ్ కనకమేడల సినిమా?

image

‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీయే సంక్రాంతి బరిలో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్లాన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News April 11, 2026

IPLలో నేడు డబుల్ ధమాకా

image

IPLలో ఈరోజు 3.30PMకి చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా PBKS, SRH తలపడనున్నాయి. PBKSపై SRHకు మంచి రికార్డు ఉంది. రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరగగా సన్‌రైజర్స్ 17 గెలిచింది. దీంతో ఈరోజు మరో విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 7.30PMకి చెన్నై వేదికగా CSK, DC మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా 19 విజయాలతో CSKదే పైచేయిగా ఉంది.