News January 19, 2025

UPDATE: ఆరెపల్లి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్‌కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 16, 2025

వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య 

image

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!