News November 17, 2024

UPDATE: జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

జహీరాబాద్‌లోని బైపాస్ వద్ద <<14625689>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు స్పాట్‌లో మృతి చెందారు. తీవ్రగాయాలైన శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటకలోని గానుగపూర్‌‌కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Similar News

News December 13, 2024

మెదక్: శిథిలావస్థలోని ఇళ్ల వివరాలను సేకరించాలి: కలెక్టర్

image

చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.

News December 13, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగడంతో జనం ఇంట్లోంచి బయటకు రావటానికి జంకుతున్నారు. వాహనదారులు, పాదచారులు చలికి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News December 13, 2024

మెదక్: ట్రాక్టర్ నడుస్తుండగానే ఊడిపోయాయి

image

రోడ్డుపై ట్రాక్టర్ నడుస్తుండగానే యంత్ర పరికరాలు విడిపోయి పడిపోయాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ చౌరస్తాలో గురువారం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రాలు, ఇంజన్ భాగం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై వాహనం నుంచి దూకడంతో ప్రమాదం తప్పింది.