News March 24, 2025

UPDATE: జాతరలో తప్పిపోయి.. శవమై కనిపించాడు

image

ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన జబ్బ సారంగం అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో మేడారం వచ్చాడు. దర్శనానికి వచ్చిన అనంతరం సారంగంకు మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయాడని కుటుంబసభ్యులు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం తాడ్వాయి మేడారం మధ్య అడవిలో మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు.

Similar News

News April 25, 2025

ఇవాళ CSKvsSRH.. ఓడిన జట్టు ఖేల్ ఖతం

image

పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న SRH, CSK మధ్య ఇవాళ సా.7.30కు కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో ఇబ్బందిపడుతున్నాయి. హోంగ్రౌండులో ఆడుతుండటం CSKకు కలిసొచ్చే అంశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని CSK, కాటేరమ్మను గుర్తుతెచ్చుకుని అదరగొట్టాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుంది? మీ కామెంట్

News April 25, 2025

పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌!

image

పాలమూరు యూనివర్సిటీలో పీజీ కళాశాలలోని సంస్కార్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ప్రిన్సిపల్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఇంటర్వ్యూ ప్రక్రియను వివరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష అనంతరం డెమో, బోధనా సెషన్‌లు నిర్వహించారు. 20 మందికి పైగా విద్యార్థులు ఈ డ్రైవ్‌కు హాజరయ్యారు. దీంతో సంస్కార్‌ను ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి అభినందించారు.

News April 25, 2025

విజయవాడ: ఒకే జైలులో నలుగురు నిందితులు

image

విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.

error: Content is protected !!