News May 19, 2024

UPDATE.. తూప్రాన్: పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు అన్న మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన <<13277126>>రోడ్డు ప్రమాదం<<>>లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కర్రె నర్సింలు(40) మృతి చెందాడు. నరసింహులు తమ్ముడి వివాహం రేపు జరగాల్సి ఉండగా ఏర్పాట్లలో ఉన్నారు. నర్సింలు, బంధువు పోచయ్య ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్, మోహన్ సైతం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News November 28, 2024

సిద్దిపేట: 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూత..?: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు ఉన్న విద్యార్థుల పాఠశాలలు 4,314, మొత్తం 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసేసే ప్రణాళికతో ఉన్నట్లున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.

News November 28, 2024

మెదక్: కుతూరిని చంపిన తండ్రికి జీవిత ఖైదు

image

కూతుర్ని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మి శారద బుధవారం తీర్పునిచ్చారు. టేక్మాల్ మండలం పాల్వంచకు చెందిన రమణయ్య(27)ను సావిత్రి రెండో పెళ్లి చేసుకుంది. కాగా అప్పటికే పుట్టిన వర్షిని(3)పై కక్ష పెంచుకున్న రమణయ్య 2021లో గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసుపై విచారించి న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.

News November 28, 2024

MDK: జనవరి వరకు చలిపంజా.. జాగ్రత్తలు తప్పనిసరి !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోయి రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు వచ్చే ఆస్కారముందన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేడి చేసిన నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.