News February 25, 2026
UPDATE: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి వృద్ధురాలి మృతి

మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జిలానీ బాషా ఓ మట్టి మిద్దెలో పిండి గిర్ని నడుపుతున్నాడు. లక్ష్మీదేవమ్మ, కురువ సాలమ్మ, మరో ఇద్దరు మహిళలు జొన్నలు పిండి గిర్నిలో వేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. పిండి గిర్ని ఆడుతుండగా కొంత మట్టి మిద్దె పైకప్పు కూలి వృద్ధురాలు మరణించారు. మరో మహిళకు గాయాలయ్యాయి.
Similar News
News April 18, 2026
గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.
News April 18, 2026
భాగ్యనగరానికి తలమానికం.. మన చార్మినార్

450 సంవత్సరాల క్రితం నిర్మితమైన సుందరమైన కట్టడం చార్మినార్. భాగ్యనగరానికి ఇది అమూల్యమైన వారసత్వ సంపద. ఈ కట్టడం నాలుగు శతాబ్దాలుగా ఇండో- ఇస్లామిక్ శిల్పకళా వైభవానికి, మతసామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మన సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మన వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. # నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.
News April 18, 2026
BHPL: కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహుల ఎదురుచూపు!

గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లో కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. కానీ ఎన్నికలు ముగిసి 3 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం లేదని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.


