News January 3, 2025

UPDATE.. నార్సింగి: రోజూ వెళ్లే వైన్స్‌కే కన్నం వేశాడు..!

image

మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్స్‌లో చోరీకి వెళ్లి తాగి పడుకున్న నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజాసోద్ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ మద్యం కొనుక్కుని తాగే వైన్స్‌కు కన్నం వేశాడు. మద్యం తాగి వైన్స్‌లోనే పడుకొని దొరికిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న దొంగను రామాయంపేట ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

Similar News

News January 25, 2025

మెదక్: జిల్లాలో 88 ఉత్తమ అధికారుల ఎంపిక

image

మెదక్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 88 మంది ఉత్తమ అధికారులు, పోలీస్, ప్రభుత్వ సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతులమీదుగా అందజేయనున్నారు. ప్రతి ఏటా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే వారిని ఎంపిక చేస్తారు.

News January 25, 2025

మెదక్: వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడాలి: మంత్రి

image

వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

News January 25, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్

image

రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.