News January 16, 2026

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

image

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.

Similar News

News February 14, 2026

NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News February 13, 2026

NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

image

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.