News March 27, 2025

UPDATE: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి..

image

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 21, 2025

HYD: KCR మాటల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్

image

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.

News December 21, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 21, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.