News May 12, 2024

UPDATE: మహిళల మృతదేహాలు లభ్యం

image

గోదావరిలో మునిగి చనిపోయిన ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన ముగ్గురి డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. పల్లూరి సత్యఅనంతలక్ష్మి(40), కప్పిరెడ్డి ఏసమ్మ(60), కర్రీ సునీత శనివారం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి గోదావరి పాయలోంచి నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో మడికి వద్ద వాడపల్లిలంక సమీపంలో వారు <<13231697>>నీటిలో మునిగిన సంగతి <<>>తెలిసిందే. మృతదేహాలు లభ్యం కాగా.. SI శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మరొకరి ఆచూకీ తెలియరాలేదు.

Similar News

News March 13, 2025

పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

image

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News March 13, 2025

రాజమండ్రి: ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం..స్పాట్ డెడ్

image

స్థానిక మోరంపూడి ఫ్లై ఓవర్ పై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రైల్వే సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నరేశ్, బి.రమేష్‌లు లాలాచెరువు నుంచి బొమ్మూరు వైపు టూవీలర్ పై వెళ్తున్నారు. మోరంపూడి ఫ్లై ఓవర్‌కు చేరుకునే సమయానికి వెనక నుంచి ఒక కారు ఢీకొట్టడంతో నరేశ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసలు తెలిపారు.

News March 12, 2025

రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

image

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!