News November 28, 2024

UPDATE..: మెడ, తల నొప్పింగా ఉందని వెళ్లి విద్యార్థి సూసైడ్ !

image

వనపర్తి జిల్లాలో 7వ తరగతి <<14725607>>విద్యార్థి సూసైడ్<<>> ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు కొడుకు ప్రవీణ్‌ మదనాపురం గురుకులంలో చదువుతున్నాడు. మంగళవారం స్కూల్‌లో కబడ్డీ ఆడుతుండగా ప్రవీణ్ తలకు గాయమైంది. బుధవారం ఉదయం మెడ, తలనొప్పిగా ఉందని తండ్రికి చెప్పగా ఆదివారం వస్తానని బుజ్జగించారు. టిఫిన్ చేసి హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.

Similar News

News December 12, 2025

MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.