News February 19, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.
News December 2, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
News December 2, 2025
హైదరాబాద్‌లో తొలి IFAS టెక్నాలజీ!

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.


