News April 12, 2024
UPDATE: విషాదం.. భర్త డెడ్‌బాడీ లభ్యం

ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.
Similar News
News March 23, 2025
రాజమండ్రి: మంత్రి దుర్గేశ్ గెటప్ ఫొటో వైరల్

ఇటీవల అమరావతిలో జరిగిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ బాలచంద్రుని వేషధారణలో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేశ్, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో MA చదువుకున్నపటి రోజుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో బాలచంద్రుని గెటప్‌లో ఉన్న మంత్రి ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.
News March 23, 2025
తూ.గో: క్యాన్సర్ కేసుల నమోదులో భయాందోళనలు వద్దు

తూ.గో జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళనలు వద్దని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఆమె బలభద్రపురంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకు గాను 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, అనపర్తి నియోజక వర్గం బలభద్రపురంలో 23 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
News March 22, 2025
RJY: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు

సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, అసభ్యకరమైన, అనైతిక, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఏ విధమైన పోస్ట్లు పెట్టొద్దని ఎస్పీ హితవు పలికారు.