News August 25, 2024
UPDATE: ఖేడ్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నారాయణఖేడ్ మండలం నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నేరంగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(27) ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.
Similar News
News November 10, 2025
మెదక్: ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ సంబందిత అధికారులతో మాట్లాడారు.
News November 10, 2025
మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News November 9, 2025
మెదక్: ’17న ఛలో ఢిల్లీ’

సీజేఐ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగ పేర్కొన్నారు. మెదక్‌లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థానంలో ఉన్న దళితులకే రక్షణ లేకుండా పోయిందని, సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.


