News February 7, 2025

UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News December 10, 2025

గొలుగొండ: బాలిక గర్భం దాల్చిన ఘటనపై పోక్సో కేసు నమోదు

image

గొలుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలిక గర్భం దాల్చిన ఘటనపై విచారణ చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు.

News December 10, 2025

సంగారెడ్డి: రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నాం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ పాల్గొన్నారు.

News December 10, 2025

నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

image

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.