News February 25, 2026
UPDATE: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి వృద్ధురాలి మృతి

మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జిలానీ బాషా ఓ మట్టి మిద్దెలో పిండి గిర్ని నడుపుతున్నాడు. లక్ష్మీదేవమ్మ, కురువ సాలమ్మ, మరో ఇద్దరు మహిళలు జొన్నలు పిండి గిర్నిలో వేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. పిండి గిర్ని ఆడుతుండగా కొంత మట్టి మిద్దె పైకప్పు కూలి వృద్ధురాలు మరణించారు. మరో మహిళకు గాయాలయ్యాయి.
Similar News
News February 25, 2026
SMA Type-1 వ్యాధి అంటే ఏంటి? చికిత్స ఖర్చు ఎందుకు ఎక్కువ?

‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ వ్యాధినే SMA Type-1 అని అంటారు. ఇదొక జన్యుపరమైన వ్యాధి. SMN1 అనే జన్యువు లోపం వల్ల సంభవిస్తుంది. 6 నెలల్లోపు శిశువుల్లో తీవ్రమైన కండరాల బలహీనత, శ్వాస/మింగడంలో ఇబ్బందులు వస్తాయి. దీనికి Zolgensma అనే ఇంజెక్షన్‌ను తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని తయారీ క్లిష్టతరం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అందుకే దీని కాస్ట్ రూ.16 కోట్లు. చికిత్స తీసుకోకపోతే <<19232308>>రెండేళ్లలోపే<<>> మరణిస్తారు.
News February 25, 2026
బాపట్ల: ఫుల్లుగా తాగి బీరు బాటిల్‌తో దాడి

విజయవాడలో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చీరాలకు చెందిన ప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఇక్కడ గదిని అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఇంటి యజమాని బంధువైన షౌకత్ అలీ ఖాన్ అక్కడికి వచ్చి, మా మేనత్త ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న షౌకత్, ప్రసాద్‌పై బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 25, 2026
మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


