News March 18, 2024
UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News November 24, 2024
HYD: మహిళపై SI వేధింపులు..!
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
News November 24, 2024
జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు ఈ నెల 28 వరకు పొడిగించినట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 25 కాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు అయినందున చాలా మంది డీడీలు తీయలేక పోయినట్లు తెలుస్తోందని, అందుకే మరో మూడు రోజులు పొడగించినట్లు నిర్వాహకులు చెప్పారు.
News November 24, 2024
GHMCలో కుక్కల బోన్లు చూశారా..?
గ్రేటర్ HYDలోని ఆరు జోన్ల పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా కుక్కల జైళ్ల మాదిరి బోన్లు అందుబాటులో ఉంచారు. కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కుక్కలకు వ్యాక్సినేషన్ అందించి, వ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొన్నింటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.