News February 19, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్‌కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
News July 9, 2025
అల్లూరి జిల్లాలో అరుదైన ఎగిరే ఉడుత

జీకేవీధి మండలం పారికల గ్రామంలో పాంగీ చందు అనే గిరిజనుడు బుధవారం ఉదయం చేను దున్నేందుకు వెళ్లగా అక్కడ చనిపోయిన ఎగిరే ఉడత కనిపించింది. ఉడతను గ్రామంలోకి తీసుకురాగా చూసేందుకు ప్రజలు గుమిగూడారు. వాడుక భాషలో మనుబిల్లి అని పిలుస్తారని స్థానికులు వెల్లడించారు. ఎగిరే ఉడత (ఫ్లయింగ్ క్విరిల్) ఏజెన్సీ గ్రామాలలో కనిపించడం చాలా అరుదని, ఎక్కడి నుంచో ఎగిరి వెళ్తూ పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు.
News July 9, 2025
తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.