News August 24, 2025
UPDATE: వడ్డీ వ్యాపారులపై దాడుల్లో పట్టుబడినవి ఇవే: CP

నిన్న NZB జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటి వివరాలను CP వెల్లడించారు. NZB డివిజన్లో రూ. 1,21,92,750 నగదు, రూ.10.14 కోట్ల విలువైన 137 చెక్కులు, రూ.7.10 కోట్ల విలువైన 170 ప్రామిసరీ నోట్లు, ఆర్మూరులో 324 ప్రామిసరీ నోట్లు, వాటి విలువ రూ.4.97 కోట్లు, రూ.1.85 కోట్ల బాండ్లు, రూ.30.36 లక్షల 62 చెక్కులు స్వాధీనపర్చుకున్నారు.
Similar News
News August 25, 2025
కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్: NZB ఎంపీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సోమవారం నిజామాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
News August 25, 2025
NZB: ఓట్ చోరీ ఆరోపణలు నిరూపించాలి: పల్లె

బీజేపీ ఓట్ చోరీ చేసిందని ఆరోపిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే నిరూపించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి సవాల్ చేశారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపి కార్యకర్తల సమావేశంలో గంగారెడ్డి మాట్లాడారు. ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్న మహేశ్ కుమార్ తన సొంత గ్రామమైన రహత్ నగర్‌లో ఎన్ని ఓట్ల చోరీ జరిగిందో నిరూపించాలన్నారు. లేకుంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.
News August 25, 2025
నిజామాబాద్: కార్మికుల సంక్షేమం ప్రాధాన్యం

ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం జరిగింది. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి సూచనలు చేశారు.