News September 7, 2024

UPDATE: 8.75 అడుగుల వరకు చేరిన మున్నేరు నీటిమట్టం

image

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మున్నేరువాగు వరద 7.26 గంటల వరకు 8.75 అడుగులకు చేరిందని ఖమ్మం మున్సిపల్ అధికారులు తెలిపారు. దాన్వాయిగూడెం , రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు వెళ్లవలసిందిగా మున్సిపల్ అధికారులు తెలిపారు..

Similar News

News October 14, 2024

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్గో ఏజెంట్లకు ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఉన్న అశ్వాపురం, బయ్యారం క్రాస్ రోడ్, సుజాతనగర్, జూలూరుపాడు, నేలకొండపల్లి, కొణిజర్ల, దమ్మపేటలో TGSRTC లాజిస్టిక్ కేంద్రాలను నడుపుటకు ఏజెంట్లను ఆహ్వానిస్తున్నట్లు కార్గో ATM పవన్ కుమార్ తెలిపారు. ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ కంప్యూటర్ ప్రింటర్, వెయింగ్ మెషీన్ ఉన్నవారు అర్హులు అని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.

News October 14, 2024

భద్రాచలం: గిరిజన యువతి యువకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ: పీవో

image

గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు బ్యూటీషియన్, టైలరింగ్, తేనెటీగల పెంపకం కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీవో పీవో రాహుల్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్, రేషన్ కార్డ్/ఉపాధిహామీ బుక్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్‌తో ఈనెల 18 లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.

News October 14, 2024

వేధింపులు ఇక ఆగవా!

image

భద్రాద్రి పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. 5 నెలల కిందట అశ్వారావుపేట SI ఉన్నతాధికారుల వేధిస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా <<14348076>>బూర్గంపాడు కానిస్టేబుల్ <<>>కూడా ఇదే కారణంతో సూసైడ్ చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులకు అడ్డుకట్ట పడేది ఎప్పుడో అని పలువురు చర్చించుకుంటున్నారు.