News March 13, 2025
UPDATE: ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

NZB రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
Similar News
News December 12, 2025
NZB: మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2,63,016 క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.
News December 12, 2025
NZB: 132 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం

నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. 184 GPల్లో 29 ఏకగ్రీవం కాగా 155 GPలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 132, బీజేపీ మద్దతుదారులు 15, BRS మద్దతుదారులు 15, జాగృతి మద్దతుదారులు నలుగురు, ఇతరులు 18 చోట్ల గెలుపొందారు.
News December 12, 2025
NZB: సర్పంచిగా గెలిచాడు.. అంతలోనే విషాదం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సంబరాలు చేసుకుంటున్న సమయంలో సర్పంచి తల్లి మృతి చెందింది. రుద్రూర్ మండలం రాణంపల్లి సర్పంచిగా కే.శంకర్ గెలుపొందాడు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన తల్లి లింగవ్వకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


