News August 2, 2024
‘దేవర’ నుంచి అప్డేట్.. Jr.NTR న్యూ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని సెకండ్ సింగిల్‌ను ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్ స్టెప్పులేసిన ఫొటోను రిలీజ్ చేశారు. ఇందులో తారక్ లుక్ ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘దేవర’ పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Similar News
News December 18, 2025
రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్‌తో ఆడే ఒక గేమ్. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి వేయాలి.
News December 18, 2025
విడాకులు తీసుకున్నట్లు నటుడి ప్రకటన

17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ‘ప్రీతికి, నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కల్గించొద్దని కోరుతున్నా’ అని సోషల్ మీడియాలో తెలిపారు. మాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన షిజు తెలుగులో ‘దేవి’తో పరిచయమై ‘సింహరాశి, మనసంతా నువ్వే, గౌతమ్ SSC, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి, రాబిన్ హుడ్’ తదితర సినిమాల్లో నటించారు.
News December 18, 2025
జోగి రమేశ్‌కు చుక్కెదురు

AP: నకిలీ మద్యం కేసు నిందితుడు (A18) జోగి రమేష్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు A19 జోగి రాములు, A2జగన్మోహన్ రావులకూ కోర్టు ఈనెల 31 వరకు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు తిరిగి జైలుకు తరలించారు. ఇక ఈ కేసులోని మరో ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. అటు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు తరలించాలన్న జోగి బ్రదర్స్ వినతిని న్యాయస్థానం ఆమోదించింది.


