News April 1, 2024
‘పుష్ప-2’ నుంచి అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. రేపటి నుంచి పుష్ప మాస్ జాతర మొదలవుతుందని మేకర్స్ ట్విటర్ వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. వేచి ఉండండి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆ ప్రకటన దేని గురించి ఉంటుందా? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Similar News
News April 20, 2025
చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
News April 20, 2025
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. విజయవాడ, ఖమ్మంలో స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. గత వారం కిలో చికెన్ ధర రూ.260 వరకు అమ్మారు. అలాగే కరీంనగర్‌లో రూ.220-240 వరకు పలుకుతోంది. కాకినాడ, విశాఖపట్నంలోనూ రూ.220-240 వరకు ఉంది. చిత్తూరులో కిలో రూ.160-170గా ఉంది.
News April 20, 2025
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: నడ్డా

సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ <<16152959>>నిశికాంత్ దూబే వ్యాఖ్యలను<<>> ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కామెంట్లను బీజేపీ ఎప్పుడూ అంగీకరించదని, మద్దతివ్వదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టును తాము గౌరవిస్తామని ట్వీట్ చేశారు.