News March 17, 2024
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది. తాజాగా పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను డైరెక్టర్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఊహించనిది ఆశించండి’ మార్చి 19న రాబోతోందని ట్వీట్ చేశారు. దీంతో ఈ మూవీ ప్రోమో వీడియో రాబోతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో పవన్ డైలాగ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News August 25, 2025
ఐదుగురు మెడికల్ విద్యార్థులు సస్పెండ్

TG: నిజామాబాద్ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో ఐదుగురు హౌస్ సర్జన్లపై చర్యలు తీసుకున్నారు. 6 నెలలు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ప్రిన్సిపల్ కృష్ణమోహన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదవడంతో పోలీసుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. కాగా రాహుల్ అనే విద్యార్థిని సీనియర్లు వేధించగా, తిరిగి ప్రశ్నించడంతో అతడిని చితకబాదారు.
News August 25, 2025
AP, TGకి 18,900 మెట్రిక్ టన్నుల యూరియా

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. దీని వల్ల యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.