News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు.

Similar News

News March 21, 2025

తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

image

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.

News March 21, 2025

శివంపేట: హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్

image

బోరు విషయంలో ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ గ్రామంలో గత రాత్రి బాలయ్య కుమారులు ప్రసాద్, రాజు అనే వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

News March 21, 2025

దంపతుల హత్య కేసులో పలువురికి శిక్ష:SP 

image

దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు వికారాబాద్ SP నారాయణరెడ్డి తెలిపారు. ధారూర్ PS పరిధిలోని నాగసముందర్ కు చెందిన చిన్న నర్సింహులు, అంజమ్మలను అదే గ్రామానికి చెందిన బంధప్పతో పాటుగా ఆరుగురుతో కలిసి దాడి చేసి చంపారు. ఈ కేసులో పలువురికి జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.

error: Content is protected !!