News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు. 

Similar News

News March 27, 2025

HYD: పెరుగుతున్న ట్యాంకర్ల పెండెన్సీ

image

HYDలో జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికి పెరిగుతోంది. జలమండలి పరిధిలో 75 ఫీలింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కానీ ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిగూడ, షాపూర్‌నగర్, గచ్చిబౌలి-2, మణికొండ, ఫతేనగర్‌లతోపాటు మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో డెలివరీకి 2, 3 రోజులు పడుతుందని జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

News March 27, 2025

బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందులో మేయర్ విజయలక్ష్మీ

image

రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ మేయర్, కార్పొరేటర్ కవితా, టి. నారాయణ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని మేయర్ అన్నారు.

News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!