News June 21, 2024
UPDATE.. HYD: విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి
విద్యుత్ షాక్ తగిలి ఓ ఇంటర్ <<13480534>>ఫస్టియర్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. కోహెడ మండలంలోని ఓ కళాశాలలో గిరీశ్ కుమార్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక గోడ దూకి పారిపోదామనుకున్నాడు. ఈ క్రమంలో గోడపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News September 21, 2024
HYD: 5 మార్గాల్లో 78.6 కి.మీ మెట్రో
HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
News September 21, 2024
నాంపల్లి: HWO జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(HWO) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసినట్లు TGPSC అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tspsc.cgg.gov.in నుంచి లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని, తమ ర్యాంక్ చూసుకోవచ్చని తెలిపారు. కాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBRT) విధానంలో జూన్ 24 నుంచి జూన్ 29 వరకు పరీక్షలు నిర్వహించి, జులై 18న ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
News September 20, 2024
HYD: వ్యభిచారం చేస్తూ 2వ సారి దొరికారు!
వ్యభిచారం కేసులో పట్టుబడి జైలుకెళ్లొచ్చినా ఆ ఇద్దరి బుద్ధి మారలేదు. మళ్లీ దందా మొదలుపెట్టారు. CYB AHTU వివరాలు.. అల్లాపూర్ PS పరిధి గాయత్రినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్(102)లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందింది. సాయంత్రం రైడ్స్ చేసి ఆర్గనైజర్ వంశీకృష్ణ, పార్వతి, విటుడిని అరెస్ట్ చేశారు. వంశీకృష్ణపై గతంలోనే పిటా కేసు నమోదైంది. మహిళ కూడా వ్యభిచారం కేసులో జైలుకెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు.