News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు.

Similar News

News December 14, 2025

IPL మినీ ఆక్షన్‌.. ఈ ప్లేయర్‌కే అత్యధిక ధర?

image

ఎల్లుండి జరిగే IPL మినీ ఆక్షన్‌లో AUS ఆల్‌రౌండర్ గ్రీన్ అత్యధిక ధర పలకొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా. ఈ వేలానికి ఆయన బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకోగా, మొదటి సెట్‌లోనే ఎక్కువ ప్రైస్ రావాలని అలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన మేనేజర్ పొరపాటున ఆప్షన్ తప్పుగా పెట్టాడని, తాను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ తెలిపారు. అత్యధిక పర్స్ ఉన్న (₹64.30Cr) KKR ఆయన్ను కొనే ఛాన్సుంది.

News December 14, 2025

BHPL: ఉప సర్పంచ్ పదవిపై ఆశలు.. ముందస్తు వ్యూహాలు!

image

పంచాయతీలో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఉప సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రెండో విడత 4 మండలాల్లో 75 పంచాయతీల్లో కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితం తేలిన వెంటనే వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. మెజార్టీ సభ్యులు చేయి ఎత్తి మద్దతు తెలిపిన వ్యక్తి ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 14, 2025

పెద్దపల్లి: మొత్తం పోలింగ్ 80.84%

image

పెద్దపల్లి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 112,658 ఓటర్లలో 91,076 మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ 80.84%గా నమోదయింది. అంతర్గాం మండలంలో అత్యధికంగా 86.40%, జూలపల్లి మండలం 84.75%, పాలకుర్తి మండలం 81.90%, ధర్మారం మండలం 75.57% పోలింగ్ నమోదు కాగా , ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంట వరకు ముగిసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.