News June 21, 2024
UPDATE.. HYD: విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి

విద్యుత్ షాక్ తగిలి ఓ ఇంటర్ <<13480534>>ఫస్టియర్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. కోహెడ మండలంలోని ఓ కళాశాలలో గిరీశ్ కుమార్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక గోడ దూకి పారిపోదామనుకున్నాడు. ఈ క్రమంలో గోడపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News December 30, 2025
HYD: మహిళలకు ఉచిత శిక్షణ

HYDలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, HYD పోలీసుల సహకారంతో MOWO Social Initiatives భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం బైక్ టాక్సీ, e-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఉచిత శిక్షణ, లైసెన్స్ సాయం, వాహన లీజ్/ లోన్ సదుపాయం అందించనున్నారు. JAN3న అంబర్‌పేట్ PTCలో ఈ మేళా జరగనుంది.
News December 30, 2025
రేపు రాత్రి దద్దరిల్లనున్న హైదరాబాద్

డిసెంబర్ 31ST.. ఈవెంట్లు, చిల్ మూమెంట్ల నైట్ ఇది. సిటీలో యువత పెద్ద ఎత్తున ప్లాన్ వేసుకుంటోంది. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు సాయంత్రం నుంచే కళకళలాడనున్నాయి. కొందరు పబ్లిక్ స్పాట్‌లకు ప్రిఫరెన్స్ ఇస్తుంటే.. మరి కొందరు ఫ్యామిలీతో కలిసి 31ST దావత్‌కు తమ ఇళ్లనే వేదిక చేసుకుంటున్నారు. మార్కెట్‌లోని DJ షాపుల్లో డాన్స్ ఫ్లోర్లు, స్పీకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రేపు రచ్చ.. రచ్చే.
News December 29, 2025
HYD కుర్రాళ్ల ‘విష్ జార్’ మాయ

కోడింగ్ రాసి అలసిపోతున్న మన Gen-Z బ్యాచ్ కొత్త ట్రెండ్ అందుకుంది. 13-wish jar మంత్రం జపిస్తోంది. ఆఫీసు గొడవలు మర్చిపోవాలని చిట్టీలు రాసి తగలబెడుతున్నారు. లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తామని భయం ఉన్నా 43% మంది డిజిటల్ మాయ వద్దని ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ టైమ్ తగ్గించాలన్నది వీరి ప్లాన్. ట్రాఫిక్ జామ్ మధ్య స్లో లివింగ్ మజా వెతుక్కుంటున్నారు. సిటీ కుర్రాళ్లంతా రియల్ లైఫ్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు.


